తిరుపతి కమిషనర్ కీలక ఆదేశాలు
TPT: వర్షాల నేపథ్యంలో తిరుపతిలోని అండర్ బ్రిడ్జిల వద్ద నీరు నిలవకుండా మోటార్లతో ఎప్పటికప్పుడు పంపింగ్ చేయాలని కమిషనర్ మౌర్య ఆదేశించారు. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో బుధవారం ఆమె పర్యటించారు. కాలువల్లో పూడికతీత పనులను పరిశీలించారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మ్యాన్ హోల్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు.