పత్తిచేనులో ప్రమాదకరంగా మారిన ట్రాన్స్‌ఫార్మర్

పత్తిచేనులో ప్రమాదకరంగా మారిన ట్రాన్స్‌ఫార్మర్

KMM: కొత్త రంగాపురం గ్రామంలో పత్తి చేనులో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని రైతులు, వ్యవసాయ కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను తక్కువ ఎత్తులో ఏర్పాటు చేయడంతో వర్షాకాలంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.