'కుక్కల నియంత్రణపై జీవీఎంసీ దృష్టి'

'కుక్కల నియంత్రణపై జీవీఎంసీ దృష్టి'

VSP: విశాఖ నగరాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్న వీధి కుక్కల్ని నియంత్రించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని బస్‌స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పాఠశాలలు, ఆసుపత్రులలో శునకాలు కనిపించకూడదని హైకోర్టు హెచ్చరించింది. ఆయాచోట్ల తిరుగుతున్న కుక్కల్ని రెండు వారాల్లోపు షెల్టర్లకు తరలించాలని పేర్కొంది. దీంతో మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు.