'రహదారి పనులను వెంటనే ప్రారంభించాలి'
కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట జాతీయ రహదారి విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. గురువారం వేంపల్లిలో ఆయన మాట్లాడారు. టెండర్లు అయిపోయి 2 సంవత్సరాలు దాటినా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం శోచనీయమన్నారు.