రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
NLG: శాలిగౌరారం మండలం వల్లాలలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో, ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి గురజాల గ్రామానికి వస్తున్న యువకుడు బైక్ అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది రమేష్, పైలట్ సమీర్ ఘటనాస్థలానికి చేరుకొని అతన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.