‘ప్రతీ 45 రోజులకు ఒక ఎయిర్‌పోర్ట్’
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానయాన ప్రాంతంగా భారత్ అవతరించిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. దేశంలో ప్రతీ 45 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం ప్రారంభమవుతోందని, భారత్ సుస్థిర వృద్ధిని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని తెలిపారు. UDAN స్కీమ్ ద్వారా విమాన ప్రయాణం సామాన్యులకు అందుబాటులోకి వచ్చిందని, ఏవియేషన్ రంగంలో భారత్ రికార్డులు సృష్టిస్తోందని పేర్కొన్నారు.