12న మండల సర్వసభ్య సమావేశం

ప్రకాశం: అద్దంకి మండల సాధారణ సర్వసభ్య సమావేశం మే 12న నిర్వహిస్తున్నట్లు అద్దంకి ఎంపీడీవో సింగయ్య సోమవారం ప్రకటన విడుదల చేశారు. మండల ఎంపీపీ అధ్యక్షతన కార్యాలయం ఆవరణంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, మండల స్థాయిలోని అధికారులు అందరూ తప్పనిసరిగా సమావేశంలో పాల్గొనాలని తెలిపారు.