పిడుగురాళ్లలో టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ
PLD: పిడుగురాళ్ల కొండమోడు–కోనంకి రోడ్డులో నిర్మించిన ఇళ్లలో మొత్తం 2,832 ఇళ్లకు అనుమతి లభించగా, తొలి విడతగా 1,296 గృహాల పట్టాలను సోమవారం పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదలకు గృహాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.