సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

జగిత్యాలలోని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో శుక్రవారం సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు రూ. 11.70 లక్షల విలువగల చెక్కులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి CMRF దోహదపడుతుందన్నారు. ప్రజల అవసరాలకు ప్రభుత్వం నిరంతరం అండగా నిలుస్తోందన్నారు.