తంబళ్లపల్లె రైతులకు సబ్సిడీపై పశువుల దాణా పంపిణీ.!
అన్నమయ్య: ప్రభుత్వం పాడి రైతులకు 50 శాతం సబ్సిడీతో పశువుల దాణాను పంపిణీ చేస్తోందని పశు వైద్యశాఖ ఏడీ సుమిత్ర అన్నారు. ఇందులో భాగంగా తంబళ్లపల్లె పశు వైద్యశాలలో శనివారం పశు వైద్యాధికారి విక్రమ్ రెడ్డి సిబ్బంది కిరణ్, మాజీ ZPTC రామచంద్ర, రామూర్తిలతో కలిసి పశువుల దాణా పంపిణీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మండలానికి 750 బ్యాగుల దాణా వచ్చిందన్నారు.