మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే
పార్వతీపురంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. పురపాలక సంఘం బెలగాం నారాయణ స్కూల్ వద్ద గల స్మశానవాటికకు రహదారి, ప్రహరీ గోడ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. పది లక్షల రూపాయల వ్యయంతో స్మశాన అభివృద్ధికి పనులు ప్రారంభించారు. పురపాలక సంఘంలోని 30 వార్డుల్లో మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు.