వన్య ప్రాణులకు ప్రత్యేక వంతెనలు

ADB: అటవీ ప్రాంతాల్లో రోడ్లు దాటుతున్న సమయంలో వాహనాలు తగిలి వన్యప్రాణులు చనిపోతున్నాయని గుర్తించిన ప్రభుత్వం జంతువులు ఎక్కువగా దాటే జాతీయ రహదారులపై ఓవర్‌పాస్, అండర్‌పాస్ బ్రిడ్జిల నిర్మాణం చేపడుతోంది. మంచిర్యాల-చంద్రాపూర్(63), జగిత్యాల - భీవండి(61) జాతీయ రహదారులపై జంతువుల కోసం ప్రత్యేకంగా వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.