పశ్చిమబెంగాల్‌లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని మోదీ ఈరోజు పశ్చిమబెంగాల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. కోల్‌కతాలో దాదాపు రూ.18,680 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు, రైల్వే, ఓడరేవులు, జలరవాణా రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు.