'మద్యం సేవించి వాహనాలు నడిపితే శిక్షలు తప్పవు'
SRCL: మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష, జరిమానా తప్పదని, సిరిసిల్ల పట్టణ ఇన్‌స్పెక్టర్ కృష్ణ హెచ్చరించారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 77 మంది మందు బాబులు పట్టుబడగా వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. మందు బాబులకు జరిమానాలు విధిస్తు మేజిస్ట్రేట్ జయశ్రీ తీర్పు ఇచ్చారు