నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద వరద స్థితి పెరిగింది. ప్రాజెక్టు 26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,92,648 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటి మట్టం 589.30 అడుగులు, పూర్తి స్థాయి 590 అడుగులు. 1,74,533 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో, 2,33,041క్యూసెక్కుల ఔట్‌ఫ్లో జరుగుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 309.9534 టీఎంసీలు, కాగా జలవిద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.