హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం

KDP: చక్రాయపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ ఇటీవల అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ ఎం.నాగార్జున రెడ్డి మరణించారు. ఈ సందర్భంగా మంగళవారం కడపలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ సంక్షేమంలో భాగంగా పోలీసు వితరణ నిధి నుండి 2.5 లక్షల ఆర్థిక సాయాన్ని హెడ్ కానిస్టేబుల్ ఎం.నాగార్జున రెడ్డి సతీమణి ఎం.జయలక్ష్మి కి అందచేశారు.