పొంగిపొర్లుతున్న భవనాసి వాగు

NDL: ఆత్మకూరులో భవనాసి వాగు వరద నీటితో పొంగిపొర్లుతుంది. గురువారం ఆత్మకూరు నుంచి సుమారు 20 గ్రామాలకు వెళ్లే దారిలో ఈ వాగు వరద నీటితో నిండి పారడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆత్మకూరు తహసీల్దార్ రత్నరాధిక, ఎంపీడీవో ఉమర్, రూరల్ సీఐ సురేశ్ కుమార్ రెడ్డి, ఎస్సై వెంకటనారాయణ రెడ్డి దగ్గరుండి అక్కడి పరిస్థితిని పర్యవేక్షించారు.