కాశీబుగ్గ ఘటనపై విచారణకు కలెక్టర్ ఆదేశం
SKLM: కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం జరిగిన తొక్కిసలాటలో మొత్తం 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముగ్గురు అధికారులతో కూడిన విచారణ బృందాన్ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరు ఈ దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వనున్నారు.