'క్షయ వ్యాధి నివారణకు అందరూ కృషి చేయాలి'

'క్షయ వ్యాధి నివారణకు అందరూ కృషి చేయాలి'

JGL: క్షయ వ్యాధి నివారణకు అందరూ కృషి చేయాలని జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్ కోరారు. రాయికల్ మండలం తాట్లవాయిలో బుధవారం డిజిటల్ మొబైల్ ఎక్స్రే మిషన్‌తో నిర్వహించిన శిబిరంలో 46 మందికి పరీక్షలు చేశారు. వ్యాధి లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సతీశ్ కుమార్, ఉప సర్పంచ్ నారాయణ పాల్గొన్నారు.