కొడంగల్‌పై శ్రద్ధ.. కామారెడ్డిపై వివక్ష: కవిత

కొడంగల్‌పై శ్రద్ధ.. కామారెడ్డిపై వివక్ష: కవిత

KMR: సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై జాగృతి చీఫ్ కవిత విమర్శలు గుప్పించారు. హోటల్ అమృత గ్రాండ్‌లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. KMRకి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అభివృద్ధి పనుల కోసం రాలేదని ఆరోపించారు. CMగా రేవంత్ రెడ్డి తాను గెలిచిన కొడంగల్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నప్పటికీ, తాను పోటీ చేసి ఓడిపోయిన KMRపై వివక్ష చూపుతున్నారని వ్యాఖ్యానించారు.