కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం సమీక్ష
BHPL: కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలకు మరమ్మతులు వేగంగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రి ఉత్తమ్‌తో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఎన్డీఎస్‌ఏ సూచనలు పాటిస్తూ వీలైనంత త్వరగా పనులు చేపట్టి, పునరుద్ధరణను వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు.