అగ్ని ప్రమాదం బాధితులకు సరుకులు అందజేత

అగ్ని ప్రమాదం బాధితులకు సరుకులు అందజేత

కృష్ణా: ఇవాళ తెల్లవారుజామున టి. కొత్తపాలెం శివారు మరియపురం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గుండం రామారావు, నంబూరు రత్నారావులకు చెందిన రెండు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో వారు నిరాశ్రయులయ్యారు. టీడీపీ నాయకులు బాధితులను పరామర్శించి, వారికి నిత్యావసర సరుకులను అందజేశారు.