చెమికీ అలంకారంలో శ్రీ విరుపాక్షి మారమ్మ దర్శనం
CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా చమికీ అలంకారంలోభక్తులకు దర్శనం భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను, ఫల పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత వివిధ రకాల చంకీలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.