ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన ఆర్డీవో

WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలోని న్యూ శాయంపేట గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ స్థలాలను నేడు రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ రాథోడ్ పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణలో భాగంగా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలను పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నట్లు ఆర్డీవో తెలిపారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ బావు సింగ్ పాల్గొన్నారు.