MGM ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే
HNK: MGM ఆసుపత్రిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సందర్శించి పలు విభాగాలను పరిశీలించి పేషెంట్లు, డాక్టర్లతో మాట్లాడారు. ఎంజీఎం ఆసుపత్రికి విచ్చేసే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేలా వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, డాక్టర్లు సమయపాలన పాటిస్తూ అనునిత్యం పేషెంట్లకు అందుబాటులో ఉండాలని సూచించారు.