ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

GNTR: గుంటూరు నగరంలో శంకర్ విలాస్ బ్రిడ్జి విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అమలు చేస్తున్న ట్రాఫిక్ డైవర్షన్ పరిస్థితులను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ పలు ప్రాంతాలను సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. రోడ్డు సమస్యలపై ప్రత్యేకంగా ప్రయాణిస్తూ ఆరాతీశారు.