నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీ

నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీ

MDK: రామాయంపేట మండల కేంద్రంలో గురువారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ రజనీకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. మండల వ్యాప్తంగా 1778 కొత్త రేషన్ కార్డ్స్, 3396 కొత్త సభ్యుల పేర్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులను స్థానిక రైతు వేదిక ఆవరణలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.