పరిశుభ్రతపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ

పరిశుభ్రతపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ

ELR: నూజివీడు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ కె. పీరయ్య మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పట్టణంలోని 32 వార్డులలో క్లీన్ అండ్ బ్యూటిఫికేషన్‌లో భాగంగా పరిశీలన చేపట్టారు. కమిషనర్ పీరయ్య మాట్లాడుతూ.. రోడ్ల పరిశుభ్రత, చెత్త కుప్పలు తొలగించటం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. డ్రైనేజీలలోని సిల్ట్‌ను తొలగించి తక్షణమే డంప్ యార్డులకు తరలించాలన్నారు.