అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
కోనసీమ: కొత్తపేట సమగ్ర శిశు అభివృద్ధి సేవా ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీవో గజలక్ష్మి తెలిపారు. కొత్తపేట 15, రావులపాలెం 11, ఆత్రేయపురం 4, ఆలమూరు 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి పాసై 21-35 ఏళ్ల వయసు గల వివాహిత స్థానిక మహిళలు నేటి నుంచి మే 4 లోపు సీడీపీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.