చిరుత పులి కలకలం.. వీడియో వైరల్

SRD: కల్హేర్ మండలంలోని బీబీపేటలో శనివారం చిరుత పులి కలకలం రేపింది. గ్రామంలోని ఓ ఇంట్లోకి చొరబడి తిరిగింది. అనంతరం బయటకు వెళ్లి పోయింది. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. గ్రామానికి చెందిన గుండు మోహన్ ఇంటి ఆవరణలో చిరుత పులి తిరగడంతో గ్రామప్రజలు భయాందోళనకు గురయ్యా రు. గతంలో ఇదే గ్రామ శివారులో లేగ దూడలను చిరుత పులి దాడి చేసి చంపేసినట్లు గ్రామస్థులు వెల్లడించారు.