"ఎన్నికలు సజావుగా జరిపేందుకు సహకరించాలి"

MBNR : బాలానగర్ మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల మండల అధ్యక్షులు పాల్గొన్నారు.