మాట నిలబెట్టుకున్న మాజీ ఎంపీ
ATP: వడ్డే కాలనీకి చెందిన చంద్రకళ కుటుంబానికి మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. బాధితురాలి సమస్యను జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ఎన్ఆర్ఐల సహకారంతో సేకరించిన రూ. 2,20,000 ఆర్థిక సాయాన్ని ఈరోజు బాధిత కుటుంబానికి అందజేశారు. కోలుకునే వరకు అండగా ఉంటామని రంగయ్య హామీ ఇచ్చారు.