ఆ హైకోర్టులో ఏదో జరుగుతోంది?: సుప్రీం
కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుల విచారణ, లిస్టింగ్‌ల వ్యవహారంలో మద్రాస్ హైకోర్టులో ఏదో తప్పిదం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసింది. ఆ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అందించిన నివేదికను పరిశీలించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేసింది. కరూర్ అనేది మదురై బెంచ్ పరిధిలో ఉంటే చెన్నై బెంచ్ ఎలా సిట్ ఏర్పాటుకు ఆదేశించిందని నిలదీసింది.