చిన్నారుల కాళ్లు కడిగిన సీఎం

చిన్నారుల కాళ్లు కడిగిన సీఎం

శ్రీరామనవమి పురస్కరించుకుని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో ఘనంగా 'కన్యాపూజ' చేశారు. తొమ్మిది మంది చిన్నారులను దుర్గాదేవి రూపాలుగా భావించి, వారికి పాదపూజ చేసి భోజనం వడ్డించారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎం యోగికి యశస్విని అనే చిన్నారి 'బొమ్మ బుల్డోజర్'ను బహుమతిగా ఇచ్చింది.