మిషన్ మధుమేహ దృష్టి కార్యక్రమం పురోగతిపై సమీక్ష

మిషన్ మధుమేహ దృష్టి కార్యక్రమం పురోగతిపై సమీక్ష

 వనపర్తి: మిషన్ మధుమేహ దృష్టి కార్యక్రమం పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ తన ఛాంబర్‌లో వైద్య అధికారులతో సమీక్షించారు. వైద్యాధికారులు ఇప్పటివరకు 12,000 మందికి పైగా ప్రజలకు స్క్రీనింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఏప్రిల్ నెలా ఆఖరిలోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.