జిల్లాకు వర్ష సూచన.. ఆందోళనలో రైతులు

జిల్లాకు వర్ష సూచన.. ఆందోళనలో రైతులు

ATP: జిల్లాలో రేపు భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు మండలాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో వర్షం పడే వేళ ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థకు చేరిన భవనాల కింద ఉండొద్దని సూచించింది. పంట కోత సమయంలో వర్షం పడుతుండడంతో మొక్కజొన్న, వరి సాగు రైతులు ఆందోళన చెందుతున్నారు.