ఇల్లందలో గుబులు రేపుతున్న క్షుద్ర పూజలు..

ఇల్లందలో గుబులు రేపుతున్న క్షుద్ర పూజలు..

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో క్షుద్ర పూజలు గుబులు రేపుతున్నాయి . వరుస క్షుద్ర పూజలతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు క్షుద్ర పూజలు చేసినట్లు ఆదివారం స్థానికులు తెలిపారు. వరుస క్షుద్ర పూజలు నిర్వహించడం పట్ల గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. అధికారులు,పోలీసులు స్పందించి క్షుద్ర పూజలను అరికట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి .