నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా: కొణతాల

అనకాపల్లి: నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని తనకు ఇవ్వాలని అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి పట్టణంలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలను వివరించారు.