ఆప్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం

ఆప్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం

ఢిల్లీలోని పాలం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆప్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్‌పై దాడికి యత్నించారు. దీంతో పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. గట్టి బందోబస్తు మధ్య బాధితులను ఆప్ అధినేత కేజ్రీవాల్ పరామర్శించారు.