విజయ డెయిరీ పాల సేకరణ ధరల సవరణ

HYD: పాల సేకరణ ధరల్లో విజయ డెయిరీ సవరణ చేసింది. 7% వెన్న ఉన్న గేదె పాల ధరను లీటర్‌కు రూ.56 నుంచి రూ.59.50కు, 10% వెన్న ఉంటే రూ.80 నుంచి రూ.84.60కి పెంచింది. 3% వెన్న ఉన్న ఆవు పాల ధర ఇప్పటి వరకు లీటర్‌కు రూ.40 ఉండగా రూ.36.50కు తగ్గించింది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.