ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

ప్రకాశం: ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పొన్నాలురు మండలం రావుకొల్లులో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాలు మేరకు.. గ్రామానికి చెందిన దాసరి ప్రశాంత్(18) నరసరావుపేటలోని ప్రైవేట్ కళాశాలలో పాలిటెక్నిక్ రెండో ఏడాది చదువుతున్నాడు. ఇటీవల కళాశాల నుంచి ఇంటికి వచ్చి గ్రామంలో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.