రేపు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు
WGL: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. బుధవారం ఆకస్మికంగా సెలవు దినం ప్రకటించిన విషయం విదితమే. వర్షాలు కొనసాగుతుండడంతో పాటు తుఫాను తెలంగాణ కేంద్రీకృతమే ఉండడంతో సెలవు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు.