తెనాలిలో ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

GNTR: తెనాలి వీడియో గ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ కె.వి. గోపాలకృష్ణ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులందరికీ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని వృత్తిలో రాణించాలని ఆయన సూచించారు.