వేటకు విరామం.. తీరానికి చేరిన పడవలు
W.G: సముద్రంలో చేపల పునరుత్పత్తి కాలం ప్రారంభం కావడంతో ప్రభుత్వం వేట నిషేధాన్ని అమలులోకి తెచ్చింది. దీంతో నరసాపురం మండలంలోని పీఎం లంక, సీఎం లంక, బియ్యపుతిప్ప తదితర గ్రామాల మత్స్యకారులు వేట నిలిపివేసి ఒడ్డుకు చేరుకున్నారు. ఈ విరామ సమయంలో తమ వలలు, బోట్లకు మరమ్మతులు చేసుకునేందుకు మత్స్యకారులు సిద్ధమవుతున్నారు.