ఢిల్లీని గజగజలాడిస్తున్న చలి

ఢిల్లీని గజగజలాడిస్తున్న చలి

ఢిల్లీలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మొన్నటి వరకు ఉక్కపోతతో అల్లాడిన దేశ రాజధాని ప్రజలు.. ప్రస్తుతం చలితో వణికిపోతున్నారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు చేరడంతో అల్లాడిపోతున్నారు. అలాగే ఢిల్లీ సగటు ఉష్ణోగ్రతలు 21.7 డిగ్రీలుగా నమోదైంది. దీంతో ఆరేళ్ల తర్వాత కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. రెండు రోజుల నుంచి వర్షం పడటమే ఇందుకు కారణమని చెప్పారు.