'కాళోజీ తెలంగాణ సాహిత్య నిధి'

NZB: కాళోజీ తెలంగాణ సాహిత్య నిధి అని నిజామాబాద్ జిల్లా తెలంగాణ రచయతల వేదిక జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ లాల్ అన్నారు. మంగళవారం కాళోజీ జయంతి సందర్భంగా గాజులపేటలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ భాషా యాసను కాపాడాలని కోరిన యోధుడు కాళోజీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వేముల శేకర్, తదితరులు పాల్గొన్నారు.