పోలీసులకు రివార్డులు అందజేత

కృష్ణా: ఎస్పీ ఆర్. గంగాధరరావు నేర సమీక్షపై సమావేశం బుధవారం మచిలీపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ వారికి రివార్డులు అందజేశారు. నేర నియంత్రణలో కృషి చేసిన వారిని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మరింత ఉత్సాహంతో ప్రజా భద్రత కోసం పనిచేయాలని ఎస్పీ సూచించారు.