నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు

నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు

NLG: చిట్యాల మండలం వెంబావి గ్రామంలో వేసవి నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టారు. 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా మరమ్మతుకు గురైన బోరుబావి మోటార్‌ను శనివారం బాగు చేయించి అందుబాటులోకి తెచ్చారు. గ్రామమంతటా పైప్‌లైన్ లీకేజీలను అరికట్టే పనులు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుణగంటి అలివేలు వెంకన్న, శంకర్ రావు పాల్గొన్నారు.