బాల్య వివాహాల నియంత్రణపై శిక్షణ

బాల్య వివాహాల నియంత్రణపై శిక్షణ

KNR: మహిళలపై జరుగుతున్న హింస, బాల్య వివాహాల నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కే. సమ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ సిబ్బందికి వివిధ చట్టాలు, హెల్ప్‌లైన్ సేవలపై నిపుణులు శిక్షణ అందించారు.