సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
MDCL: జగద్గిరిగుట్ట డివిజన్ షిర్డి హిల్స్ కాలనీలో సుమారు రూ. 42 లక్షలతో నూతనంగా చేపట్టనున్న 8 సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్య అభివృద్ధి, ప్రజా సంక్షేమం అభివృద్ధికి తారక మంత్రమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు.